News2nd Nov 12:26 PMSunil Byrisetty1 min read
లండన్ పర్యటనకు బయలుదేరిన మంత్రి కందుల దుర్గేష్
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నవంబర్ 4 నుంచి 6 వరకు లండన్‌లో జరిగే “వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) - 2025”లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చి
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నవంబర్ 4 నుంచి 6 వరకు లండన్‌లో జరిగే “వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) - 2025”లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే దిశగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లండన్ పర్యటనకు బయలుదేరారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయి చేరిన మంత్రి దుర్గేష్, ఆదివారం ఉదయం ముంబయి విమానాశ్రయం నుండి నేరుగా లండన్ పయనమయ్యారు. నవంబర్ 4 నుంచి 6 వరకు లండన్‌లో జరుగనున్న “వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) – 2025” గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. మంత్రి దుర్గేష్ ఈ వేదిక ద్వారా రాష్ట్ర పర్యాటక సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.