News18th Mar 12:36 PMSunil Byrisetty1 min read

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన ఒంటిమిట్ట రామాలయాన్ని అధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని, త్వరలోనే ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని అధ్యాత్మిక, పర్యా

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట
రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన ఒంటిమిట్ట రామాలయాన్ని అధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని, త్వరలోనే ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. టెంపుల్ టూరిజం క్రింద ఒంటిమిట్ట సీతారామ స్వామి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఆ దేవాలయం క్రింద చుట్టు ప్రక్కల ఉన్న దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్ లను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనను చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒంటిమిట్ట సీతారామ స్వామి వారి దేవాలయం తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పాలసీ ద్వారా ఆధ్యాత్మిక టూరిజంకు కొన్ని టెంపుల్స్ ని, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజం లతో పాటు విభిన్న సర్క్యూట్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.
Kandula Durgesh
Vontimitta Cheruvu
ఒంటిమిట్ట సీతారామ స్వామి
మంత్రి కందుల దుర్గేష్
Scroll for the next article