News15th Oct 04:52 PMSunil Byrisetty1 min read
ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి
గ్లోబల్ డెస్టినేషన్ సెంటర్ లుగా తిరుపతి, విశాఖల అభివృద్ధితో పాటు త్వరలోనే ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని
గ్లోబల్ డెస్టినేషన్ సెంటర్ లుగా తిరుపతి, విశాఖల అభివృద్ధితో పాటు త్వరలోనే ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో రెండవ రోజు జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఏపీ ప్రతిపాదనలు వెల్లడించారు. ప్రధానంగా తిరుపతిలో కల్నరీ ఇన్ స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ డ్రామా కేటాయించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థించారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పర్యాటక భవన్ తెలంగాణలోనే ఉండిపోయిందని ఈ క్రమంలో ఏపీకి మంజూరు చేయాల్సిందిగా మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్ కు త్వరితగతిన ఆమోదం తెలిపితే తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా పర్యాటకులకు అవసరమయ్యే సమాచారం లభించేందుకు అవకాశం ఉంటుందన్నారు.