Politics5th Mar 10:41 AMSunil Byrisetty1 min read

రెండవ రోజు జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్

పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అయి ఏపీ పర్యాటకాభివృద్ధి అవకాశాలు, వనరులు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రత

రెండవ రోజు జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్
పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అయి ఏపీ పర్యాటకాభివృద్ధి అవకాశాలు, వనరులు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ వివరించారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఏపీలో దాదాపు 1000 కి.మీల సుదీర్ఘ విశాల సముద్రతీరం,అందమైన బీచ్ లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మంత్రి దుర్గేష్ ఉన్నాయన్నారు. సాహస పర్యాటకం, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్,ప్రపంచ పర్యాటకులు చూడాల్సినవని వివరించారు.
Mantri Durgesh
AP News
Latest News
Tourism
Germany
మంత్రి దుర్గేష్
ఎపి న్యూస్
తాజా వార్తలు
పర్యాటకం
జర్మనీ
Scroll for the next article