News3rd Jul 02:51 PMSunil Byrisetty1 min read
పర్యాటక, అతిథ్య రంగాల్లో విస్తృత అవకాశాలు
ఎక్కువ మందికి ఉపాధిని చూపిస్తూ, ఏటా వృద్ధి నమోదు చేస్తున్న రంగాల్లో ఆతిథ్య రంగం చాలా ముఖ్యమైందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అ
ఎక్కువ మందికి ఉపాధిని చూపిస్తూ, ఏటా వృద్ధి నమోదు చేస్తున్న రంగాల్లో ఆతిథ్య రంగం చాలా ముఖ్యమైందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీని సంబంధిత యాజమాన్యం విజ్ఞప్తి మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. అనంతరం అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి దుర్గేష్ సమాధానాలు వెల్లడించారు. గతేడాది విజయవాడలో వెస్టీన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో జరిగిన కాపీ అండ్ కన్వర్జేషన్ కార్యక్రమంలో అతిథ్య రంగ అవకాశాలను అందపుచ్చుకోవాలని యువతకు స్పష్టం చేశానని గుర్తుచేశారు. అతిథ్య రంగం రోజురోజుకు విస్తరిస్తోందని, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పర్యాటక, అతిథ్య రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలంటే బాగా చదివి అత్యుత్తమంగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతోందని, హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఇతరత్రా అనేకంగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.