News5th Jul 12:04 PMSunil Byrisetty1 min read
ఇంటింటికీ మంత్రి అచ్చెన్న
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సంద
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు. ఏడాదిలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని గ్రామ ప్రజలు సైతం బదులిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రం వదిలి వెళ్లిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ తిరిగి తెస్తున్నారని మంత్రి వివరించారు.