News30th Sep 05:13 PMSunil Byrisetty1 min read
విద్యార్ధులను తీర్చిదిద్దేది టీచర్లే
సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. ఎస్ ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ &
సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. ఎస్ ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డీఎస్సీ అంటే అందని ద్రాక్ష పండులా ఉండేదని, దానిని అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16 వేల టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారన్నారు. ఇందులో ఎక్కువగా ఎంపికైన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారై ఉంటారన్నారు. అలాంటి పిల్లలను సక్రమమైన దారిలో పెట్టి విద్యాబుద్దులు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో లో మాజీ శాసనమండలి సభ్యులు కె. లక్ష్మణ రావు, మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.