News31st May 05:07 PMSunil Byrisetty1 min read
ప్రజాసమస్యలపై ప్రజా దర్బార్
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుం
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు.
అర్జీలలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాన సమస్యలైన రెవెన్యూ, భూమి,ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ, గుంతల రహదారులు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు.
వచ్చే జూన్ నెల 12 వ తేదీన కొత్తగా 95 వేల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామన్నారు.
రేషన్ కార్డులు కూడా సరిచేసి కొత్తవి ఇవ్వడం జరుగుతుందన్నారు. జూన్ నెల 1 నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు.
దీపం 2 పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు.