News3rd Jun 09:21 AMSunil Byrisetty1 min read
5 నుంచి మసులా ఉత్సవాలు!
మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మసుల ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహిస్తామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈనెల
మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మసుల ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహిస్తామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈనెల 5, 6, 7, 8 తేదీలలో 4 రోజులపాటు మంగినపూడి బీచ్ లో మసుల ఫెస్ట్ 2025 నిర్వహిస్తున్నామన్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవంగా పర్యాటక పురోభివృద్ధి దిశగా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జల క్రీడలు, సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలు, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి జాతీయ క్రీడలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పోటీలలో 24 రాష్ట్రాల నుంచి బృందాలు పాల్గొంటున్నాయన్నారు.
కయాకింగ్ జల క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి ముఖద్వారం ఐకానిక్ నిర్మాణం, 100 అడుగుల జాతీయ పతాకము ఏర్పాటు బీచ్ ఉత్సవాలతో ప్రతి వారాంతపు సెలవు రోజుల్లో రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందన్నారు.
ఈ బీచ్ ఉత్సవాలు అందరి మదిలో జీవితాంతం గుర్తుండిపోయే విధంగా కృషి చేస్తుందన్నారు.