News4th Aug 10:25 AMSunil Byrisetty1 min read
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి
గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండ
గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా 2047 విజన్ ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తపిస్తున్నారని ఆయన కల నెరవేరాలని భగవంతున్ని ప్రార్థించానని అన్నారు. అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా, ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ వారి వారి కుటుంబాలలో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకున్నానని అన్నారు.