Telangana6th Dec 01:46 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 త

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరప తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్టు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. సీఎం చంద్రబాబు తప్పకుండా హాజరవుతానని చెప్పారు.
Telangana Rising Global Summit 2025
Komatireddy Venkata Reddy
CM Chandrababu Naidu
Hyderabad summit
business conference
దావోస్ తరహా సమ్మిట్
వ్యాపార సదస్సు
తెలంగాణ ప్రభుత్వం
Scroll for the next article