Telangana16th Oct 12:33 PMSunil Byrisetty1 min read
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ ఊస్టింగ్?
తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుందని సిట్టింగ్ మంత్రి కూతురే బయట పెట్టడం సంచలనంగా మారిం
తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుందని సిట్టింగ్ మంత్రి కూతురే బయట పెట్టడం సంచలనంగా మారింది. సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై వేటు వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమైనట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కొండా సురేఖపై వేటు వేసే అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొండా సురేఖ దేవాదాయ శాఖలోని ఫైల్స్ అన్ని అప్పగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.