News15th Sep 09:06 AMSunil Byrisetty1 min read
గ్లోబల్ ఎస్‌ఎంఈ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రతిష్ట పెంచిన మంత్రి కొండపల్లి
దావోస్‌లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎస్‌ఎంఈ సమ్మిట్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచారు. రాష్ట్రంల
దావోస్‌లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎస్‌ఎంఈ సమ్మిట్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించడంతో 11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులపై అవగాహన ఏర్పడింది. పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, నవంబర్ 14,15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్ రాష్ట్రానికి మరో కీలక వేదిక అవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేసి, రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.