News14th Jul 12:38 PMSunil Byrisetty1 min read

వియత్నం ప్రమాద బాధితుల కోసం కొండపల్లి చొరవ

వియత్నం పడవ ప్రమాదంలో ఏపీవాసులకు అండగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిలుస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్ర ప్రదేశ్ వాసుల మూడు మృతదేహాలు ఈ ఉద‌యం 7.30 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర

వియత్నం ప్రమాద బాధితుల కోసం కొండపల్లి చొరవ
వియత్నం పడవ ప్రమాదంలో ఏపీవాసులకు అండగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిలుస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్ర ప్రదేశ్ వాసుల మూడు మృతదేహాలు ఈ ఉద‌యం 7.30 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గోకు చేరుకున్నట్లు వెల్లడించారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపూర్ చెందిన రవితేజ మృతి చెందిన విషయం తెలిసిందే. ముంబైలో చట్టపరమైన కార్యక్రమాలు పూర్తి చేసి, కుటుంబ సభ్యులకు నేరుగా పార్థివ దేహాల అప్పగించేలా మంత్రి చొరవ తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ఎయిర్‌పోర్ట్‌లో ప‌రామ‌ర్శించి మృత‌దేహాల‌ను ద‌గ్గ‌రుండి వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించారు. హైదరాబాద్ నుండి బాధితుల స్వగ్రామాలకు భౌతికకాయాలను తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అత్యవసర సమయాల్లో ప్రవాస ఆంధ్రా పౌరులకు APNRTS అండగా నిలుస్తుందని తెలిపారు.
Andhra Pradesh
Vietnam Boat Accident
Kondapalli Srinivas
APNRTS
NRI Affairs
Repatriation
Shamsabad Airport
Kadapa
మచిలీపట్నం
హిందూపూర్
మృతదేహాల తరలింపు
అత్యవసర సహాయం
Scroll for the next article