News11th Oct 11:32 AMSunil Byrisetty1 min read
జాతీయ సరస్ ఏర్పాట్లు పూర్తి చేయాలి
జాతీయ సరస్ ఆజీవిక మేళా విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31వ తే
జాతీయ సరస్ ఆజీవిక మేళా విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న "జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026" ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎన్‌సీఆర్ బయట తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం మన రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల (SHG) ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తుండగా... దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ మేళాలో చేనేత వస్త్రాలు, హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులు, లైవ్ ఫుడ్ కోర్టులు, ఎఫ్‌పీఓ, సీఎల్‌ఎఫ్, సరస్ శక్తి కలెక్షన్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని మంత్రి పేర్కొన్నారు.