News21st Nov 02:07 PMSunil Byrisetty1 min read
సెర్ప్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష
గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ(సెర్ప్)పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. రూ.16,846 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు, తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. హైఫర్ ఇ
గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ(సెర్ప్)పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష
నిర్వహించారు. రూ.16,846 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు, తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. హైఫర్ ఇంటర్నేషనల్, వాసన్, కాల్గుడి, బ్రెడ్స్ సంస్థల ద్వారా వంద రైతు ఉత్పత్తి సంస్థలు బలోపేతం చేసే అంశంపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష.. రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు వాసన్ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలపై చర్చ నిర్వహించారు.
2025-26 ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘ సభ్యులను మహిళా వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, కొత్త సంస్థల ఏర్పాటుపై సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.578.08 కోట్లతో 39,371 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు వ్యాపార సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయగా.. మిగిలిన లక్ష్యాలను వచ్చే ఏడాది మార్చిలోగా సాధించాలని అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు.