News11th Sep 11:18 AMSunil Byrisetty1 min read
నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న ఏపీ భవన్, ఎంబసీ అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటగా హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.