News6th Jul 11:41 AMSunil Byrisetty1 min read
మా'స్టార్స్' మీకు హ్యాట్సాఫ్
ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్ అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ లోకేష
ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్ అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయమని కొనియాడారు. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు అని పేర్కొన్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేశారు.