News6th Dec 04:28 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ సహకారంతో తోపుడు బళ్లు అందజేత

మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో చిరువ్యాపారం చేసుకునే పలువురికి శనివారం టిఫిన్, తోపుడు, రిక్షా బళ్లు అందజేశారు. కాజ గ్రామానికి చెందిన మెట్టెల శ్రీనివాసరావు, రావి

మంత్రి లోకేష్ సహకారంతో తోపుడు బళ్లు అందజేత
మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో చిరువ్యాపారం చేసుకునే పలువురికి శనివారం టిఫిన్, తోపుడు, రిక్షా బళ్లు అందజేశారు. కాజ గ్రామానికి చెందిన మెట్టెల శ్రీనివాసరావు, రావి రమాదేవిలకు టిఫిన్ బళ్లు అందజేశారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన కొమ్మా రమాదేవికి టిఫిన్ బండి, నవులూరు గ్రామానికి చెందిన షేక్ షఫీక్ అలీకి తోపుడు బండి, మంగళగిరి పట్టణం 21వ వార్డుకు చెందిన గుండిమెడ రామారావుకు రిక్షా బండి, 1వ వార్డుకు చెందిన రెబ్బా మాణిక్యంకు, 3వ వార్డుకు చెందిన సుంకర కుమారికి టిఫిన్ బళ్లు అందజేశారు. తమ కుటుంబ జీవనోపాధికి అవసరమైన తోపుడు బళ్లు అందజేయాలని మంత్రి నారా లోకేష్‌‌ని కోరగా వెంటనే స్పందించిన ఆయన స్థానిక నాయకుల చేతుల మీదుగా బళ్లు అందజేయించారు. మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చిరువ్యాపారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షురాలు వాసా పద్మ తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Lokesh
Mangalagiri
Tiffin Carts
Pushcarts
Rickshaw Carts
Small Traders
Livelihood Support
సంక్షేమ కార్యక్రమాలు
ఆర్థికాభివృద్ధి
టిడిపి
మద్దతు
Scroll for the next article