Spiritual19th Jul 04:06 PMSunil Byrisetty1 min read

శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి మంత్రి లోకేష్ విరాళం

మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్

శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి మంత్రి లోకేష్ విరాళం
మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు శుక్రవారం కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం పునః నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి నారా లోకేష్ కు 20 వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ శ్రీ రాములవార్ల కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్‌కు ఉండాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Andhra Pradesh news
Mangalagiri
Srirama temple
Nara lokesh
Temple Reconstruction
donation
దేవస్థాన పునఃనిర్మాణం
విరాళం
Scroll for the next article