News30th Sep 05:09 PMSunil Byrisetty1 min read

అనాథ పిల్లల కోసం మంత్రి లోకేష్

కడప జిల్లా దువ్వూరు గ్రామానికి చెందిన అనాథ చిన్నారులకు అండగా నిలవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దువ్వూరుకు చెందిన ఏడేళ్ల యశ్వంత్, ఆరేళ్ళ లక్ష్మీ తల్లిదండ్రులు ఇటీవల మరణించ

అనాథ పిల్లల కోసం మంత్రి లోకేష్
కడప జిల్లా దువ్వూరు గ్రామానికి చెందిన అనాథ చిన్నారులకు అండగా నిలవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దువ్వూరుకు చెందిన ఏడేళ్ల యశ్వంత్, ఆరేళ్ళ లక్ష్మీ తల్లిదండ్రులు ఇటీవల మరణించారు. తల్లి గంగాభవాని అనారోగ్యంతో చనిపోయిన 105 రోజులకు తండ్రి నరసింహులు సైతం కామెర్లతో చిన్నారులను అనాథను చేసి మరణించారు. దీంతో అనాథలను ఆదుకోవాలంటూ పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ వార్తపై స్పందించిన మంత్రి లోకేష్ వీరికి ప్రభుత్వం తరపున అన్ని పథకాలు అందించడంతోపాటు వీలున్నంత సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
Andhra Pradesh
Social Welfare
Kadapa
Duvvur
Minister Lokesh
Orphan Children
Government Support
అనాథ పిల్లలు
పిల్లల రక్షణ
విద్యా సహాయం
ఆర్థిక భరోసా
Scroll for the next article