News29th Aug 11:59 AMSunil Byrisetty1 min read
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారి వినతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.