News29th Mar 02:54 PMSunil Byrisetty1 min read
పేద ముస్లిం నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు
రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం షేక్ షహెన్షా నివాసాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు. షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇ
రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం షేక్ షహెన్షా నివాసాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు.
షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ముందుగా షహెన్షా నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ వుధూ(కాళ్లు, చేతులు కడుక్కోవడం) నిర్వహించి ముస్లింల సంప్రదాయ కుఫీ టోపీ ధరించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు సందర్భంగా షహెన్షా నివసిస్తున్న ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు.
షహెన్షా తల్లిదండ్రులు షేక్ జమాలుద్దీన్, రెహ్మతున్నీసాలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఏం పనిచేస్తారని జమాలుద్దీన్‌ను మంత్రి ప్రశ్నించగా తాను టైలర్ నని, 50 ఏళ్లుగా టైలరింగ్ వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించానని, ఇప్పుడు తన వయసు 70 ఏళ్లు పైబడటంతో ఆరోగ్యం సహకరించక ఇంటివద్దనే ఉంటున్నాననని బదులిచ్చారు.
కూటమి ప్రభుత్వం సకాలంలో అందించే రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ తో ఎంతో భరోసా లభిస్తోందని చెప్పారు.
ఎంతమంది సంతానం అని మంత్రి ప్రశ్నించగా.. తనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడని బదులిచ్చారు.
అందరికీ వివాహాలు పూర్తయి, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని బదులిచ్చారు.