News3rd Nov 01:00 PMSunil Byrisetty1 min read

విజయవాడలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుక

విజయవాడలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
విజయవాడ ఐటీఐ కాలేజ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వీఐపీ, ఏసీ జనరల్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి అందుబాటులోని సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్ ను ఆసుపత్రి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి.లక్ష్మీ కుమార్, సీఈవో కె.సుధాకర్ తో పాటు ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Vijayawada
Vasudha Multi-Speciality Hospitals
Nara Lokesh
Hospital Inauguration
ITI College Road
Healthcare
G. Lakshmi Kumar
K. Sudhakar
కేశినేని చిన్ని
కొల్లు రవీంద్ర
గద్దె రామ్మోహన్ రావు
వీఐపీ వార్డు
Scroll for the next article