News23rd May 04:48 PMSunil Byrisetty1 min read

మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్!

కడప జిల్లాలో తొలిసారి నిర్వహించే మహానాడులో తెలుగుదేశం పార్టీ కొత్త అంశాలతో ముందుకొస్తోంది. గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడును నిర్వహించాలనేది లోకేష్ అభిప్రాయంగా క

మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్!
కడప జిల్లాలో తొలిసారి నిర్వహించే మహానాడులో తెలుగుదేశం పార్టీ కొత్త అంశాలతో ముందుకొస్తోంది. గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడును నిర్వహించాలనేది లోకేష్ అభిప్రాయంగా కన్పిస్తోంది. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి.. దాన్ని సమర్థవంతంగా నడుపుతూ కార్యకర్తల మనస్సులో ప్రత్యేక ముద్ర వేయించుకున్న లోకేష్.. పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించిన నాటి మూల సిద్దాంతం. ఆ సిద్దాంతం నుంచి స్ఫూర్తి పొంది.. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ విధానపరమైన మార్పులు తేవాలని లోకేష్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగా తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలో....సోషల్ రీయింజనీరింగ్, యువగళం, అన్నదాతకు అండ, కార్యకర్తే అధినేత అనే ఆరు అంశాలను మంత్రి లోకేష్ విధానాలుగా ప్రకటించనున్నారు.
Andhra Pradesh
Kadapa
Minister Nara Lokesh MARK
TDP Mahanadu
కడప జిల్లా
మహానాడులో మంత్రి నారా లోకేష్ మార్క్
Scroll for the next article