News28th Sep 04:42 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ ను కలిసిన అంధ క్రికెటర్

భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అజయ్ కుమార్ రెడ్డి నేతృత్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధ క్రికెటర్
భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారత అంధుల క్రికెట్ జట్టు మూడు సార్లు ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ను కలిసిన అజయ్.. రాష్ట్రంలో అంధుల క్రికెట్ అభివృద్ధితో పాటు గతంలో రాష్ట్రం తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకుని అంధ క్రికెటర్లకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంధుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీ.రవీంద్రబాబు పాల్గొన్నారు.
Scroll for the next article