News15th Oct 11:01 AMSunil Byrisetty1 min read
కలాం స్మృతికి మంత్రి లోకేష్ నివాళి
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశ
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగారని కొనియాడారు. ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడించారని గుర్తు చేశారు. రాష్ట్రపతి పదవికే వన్నె తీసుకువచ్చిన అబ్దుల్ కలాం అని.. తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని లోకేష్ పిలుపునిచ్చారు.