News24th Nov 12:27 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ ఉపాధ్యాయినిని మెచ్చుకున్న మంత్రి లోకేశ్

అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం, పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులలో ఒకరిగా కలి

ప్రభుత్వ ఉపాధ్యాయినిని మెచ్చుకున్న మంత్రి లోకేశ్
అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం, పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులలో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో, సామెతలు, సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా “English made easy”, “Lets learn with techniques” అనే పద్ధతుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం వంటి కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా నేర్పించడం ప్రశంసనీయమని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ఎడ్యుటైన్‌మెంట్ (వినోదంతో కూడిన విద్య) కంటెంట్ బాగుందని మంత్రి కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసి ప్రశంసించారు.
AP Education Department
Nara Lokesh
Kousalya Teacher
Anantapur
Education
Government School
Innovative Teaching
Edutainment
English Made Easy
Lets Learn With Techniques
Scroll for the next article