News3rd Aug 09:40 AMSunil Byrisetty1 min read

తండ్రి ప్రేమ.. సెలవు తీసుకున్న లోకేష్

నిత్యం బిజీగా ఉండే మంత్రి నారా లోకేష్, ఒక రోజు సెలవు తీసుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్ స్కూల్‌లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌కి హాజరయ్యారు. రాష్ట్రంలో కీలక మంత్రిగా, ముఖ్యమంత్రి

తండ్రి ప్రేమ.. సెలవు తీసుకున్న లోకేష్
నిత్యం బిజీగా ఉండే మంత్రి నారా లోకేష్, ఒక రోజు సెలవు తీసుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్ స్కూల్‌లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌కి హాజరయ్యారు. రాష్ట్రంలో కీలక మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా నిరంతరం అనేక సమావేశాలు, అధికార పర్యటనలతో నిత్యం తీరిక లేకుండా లోకేష్ గడుపుతున్నారు. అయితే ఈసారి మాత్రం తన కొడుకు పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. అంటూ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంది. తన అధికారిక ట్విట్టర్‌లో లోకేష్ ఇలా పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు దేవాన్ష్‌కి స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఆ సందర్భం కోసం సెలవు తీసుకున్నా. పబ్లిక్ లైఫ్ ఎప్పుడూ పరుగుల్లో ఉంటుంది కదా.. అందుకే ఇలాంటి క్షణాలు మరింత విలువైనవిగా అనిపిస్తాయి. దేవాన్ష్‌ ప్రపంచం, అతని కథలు, నవ్వు అన్నీ చూసి ఓ తండ్రిగా గర్వంగా ఉంది. We are proud of you, Devaansh!’’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Andhra Pradesh news
Nara Lokesh
Devaansh
Parent Teacher Meeting
TDP
Family Moments
పేరెంట్ టీచర్ మీటింగ్
సెలవు తీసుకున్న లోకేష్
Scroll for the next article