News16th Oct 06:02 PMSunil Byrisetty1 min read

రాయచోటి అభివృద్ధిపై మంత్రి సవాల్‌

రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న రాయచోటిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ర

రాయచోటి అభివృద్ధిపై మంత్రి సవాల్‌
రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న రాయచోటిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో పరిష్కారానికి నోచుకోని తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా సుమారు రూ.450 కోట్లతో ఆరు మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు చేపట్టామని, శ్రీనివాసపురం రిజర్వాయర్‌ నిర్మాణానికి సుమారు రూ.420 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రాయచోటికి వచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం, సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గాలివీడు ప్రాంతంలోనూ అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Scroll for the next article