News12th Sep 03:03 PMSunil Byrisetty1 min read
ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు 'మంత్రి' వార్నింగ్..!
'వినాయక చవితి' వేళ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు రవాణా శాఖ 'మంత్రి మండిపల్లి' వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన
'వినాయక చవితి' వేళ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు రవాణా శాఖ 'మంత్రి మండిపల్లి' వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ఛార్జీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. వాహనాలు 80 కి.మీ. వేగం దాటితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 'ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత.. అధిక ఛార్జీలపై ఫిర్యాదు చేయాలని' ప్రయాణికులకు మంత్రి పిలుపునిచ్చారు.