News27th Apr 03:07 PMSunil Byrisetty1 min read
దివ్యాంగుడి కోసం నేలపై మంత్రి!
ఏపీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్
ఏపీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు.
తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు.
ఆర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దివ్యాంగుడి కోసం స్వయంగా మెట్లపై కూర్చుని మాట్లాడిన మంత్రిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
బాధితులకు అండగా నిలిచిన తీరు ఆదర్శమంటూ చెబుతున్నారు.