News4th May 03:38 PMSunil Byrisetty1 min read

మానవత్వం చాటుకున్న మనోహర్!

విజయవాడ నుంచి కాకినాడ వెళ్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, భీమడోలు సమీపంలోని ఎం. నాగులపల్లి అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి మానవత్వం చాటుకున్నారు. జాతీయ

మానవత్వం చాటుకున్న మనోహర్!
విజయవాడ నుంచి కాకినాడ వెళ్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, భీమడోలు సమీపంలోని ఎం. నాగులపల్లి అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన మంత్రి వెంటనే తన వాహనం ఆపి గాయపడిన వ్యక్తులకు సహాయం అందించారు. అంబులెన్స్‌ కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్‌కు ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించి వేగంగా ఆసుపత్రికి చేరేలా చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
minister nadeendla manohar
humanity
Vijayawada
Kakinada
మంత్రి నాదెండ్ల మనోహర్
రోడ్డు ప్రమాదాన్ని చూసి మానవత్వం చాటుకున్నారు
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు
Scroll for the next article