News2nd Dec 05:20 PMSunil Byrisetty1 min read

రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల.. రేట్లెంతంటూ ఆరా!

ప్రజలకు నాణ్యమైన, సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడ పడమట రైతు బజార్‌ తనిఖీ చేసి, క

రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల.. రేట్లెంతంటూ ఆరా!
ప్రజలకు నాణ్యమైన, సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడ పడమట రైతు బజార్‌ తనిఖీ చేసి, కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశించారు. బియ్యం, ఇతర ధాన్యాలు నాణ్యతతో విక్రయించాలన్నారు. రైతు బజార్ మొత్తం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
Ap govt
Rythu Bazaar
Minister Nadendla Manohar
Vijayawada
Vegetable Prices
Public Interaction
Market Inspection
వినియోగదారుల సంక్షేమం
నాణ్యమైన ఉత్పత్తులు
సహేతుక ధరలు
రైతు మార్కెట్
Scroll for the next article