News29th Apr 01:53 PMSunil Byrisetty1 min read

ప్రణాళికాబద్దంగా రాజధాని పునర్నిర్మాణం

అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రణాళికాబద్దంగా చేపడుతున్నామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జనసే

ప్రణాళికాబద్దంగా రాజధాని పునర్నిర్మాణం
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రణాళికాబద్దంగా చేపడుతున్నామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. జనసేన ఇప్పుడు ప్రశ్నించే పార్టీగా మాత్రమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎదిగిందని మంత్రి మనోహర్‌ అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రైతులు చేసిన త్యాగాలే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసి, మూడు రాజధానుల పేరిట రైతులను మోసం చేసిందని, దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైందని చెప్పారు. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో రోడ్లు, భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసుకుంటామని స్పష్టం చేశారు. మే రెండో తేదీన అమరావతిలో జరుగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు
Minister Nadendla Manohar
PM Modi visit to Amaravati
Betapudi
మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో రచ్చబండ
మంత్రి మనోహర్‌
Scroll for the next article