News5th Dec 11:51 AMSunil Byrisetty1 min read

పీటీఎంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొ

పీటీఎంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి సభలో ప్రసంగించారు. ముందుగా స్కూల్ లో ఉన్న సరస్వతి విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి.. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ని సందర్శించారు. సుమారు 36 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన నూతన భవనం, అందులో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్, లైబ్రరీనీ మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్, వివిధ శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Nadendla Manohar
PTA Meeting
Tenali
Guntur District
School Development
New Building Inauguration
Chemistry Lab
ప్రారంభం
విద్యార్థుల ఎగ్జిబిషన్
జిల్లా పరిషత్ హై స్కూల్
ప్రభుత్వ కార్యక్రమం
Scroll for the next article