News1st Jun 03:51 PMSunil Byrisetty1 min read

రేషన్ దుకాణాలతో ప్రజా పంపిణీ

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రం

రేషన్ దుకాణాలతో ప్రజా పంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా.. తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇంటింటికీ రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు రూ.17 వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తే.. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీతో దాదాపు రూ.385 కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పని చేయాలని సూచించారు. పిఠాపురంలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో రేషన్ షాపులను పునః ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Andhra Pradesh news
minister nadendla manohar
ration Shops
ration dealers
షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు
Scroll for the next article