News5th Apr 04:25 PMSunil Byrisetty1 min read
భక్తులతో కలిసి అన్నప్రసాదంలో మంత్రి నాదెండ్ల
తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ
తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అనంరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు