News30th Jan 04:32 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వం వచ్చాక 4 లక్షల ఉద్యోగాలు
‘అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుం
‘అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న’ట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలో ‘హలో లోకేష్’ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ‘జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. పాదయాత్ర నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. రాష్ట్రంలో కోట్లాది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను తెలుసుకునే అవకాశం లభించింది. పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నా. నాటి అనుభవాలనే ఇప్పుడు ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం. ప్రభుత్వంలోకి రావడంతోనే మా పని పూర్తికాలేదు, అసలు పని ఇప్పుడే మొదలైంది. ఇకపై నెలకు ఒకసారి విద్యార్థులను కలవాలని భావిస్తున్నాను. దీనిద్వారా విద్యార్థుల ఆకాంక్షలు, మనోగతాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించామ’ని మంత్రి లోకేష్ వివరించారు.