Education24th Sep 11:27 AMSunil Byrisetty1 min read

చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం

చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిత్

చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం
చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ... గత ఏడాది నవంబర్ లో గురజాల ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వ రంగంలో ద్రవిడియన్, ప్రైవేటురంగంలో అపోలో వర్సిటీలు ఆ జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు వర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ద్రవిడియన్ వర్సిటీ చిత్తూరులో ఉన్నప్పటికీ అది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్సిటీ, కలసికట్టుగా పనిచేసి, చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడులో హైస్కూలును జూనియర్ కాలేజిగా అప్ గ్రేడ్ చేయాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య కోరగా, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ... గతసర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. తుని ఎమ్మెల్యే దివ్య చేసిన విజ్ఞప్తిపై వివరాలు తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Andhra Pradesh Education
Chittoor University
Nara Lokesh
AP Assembly Sessions
Gurazala Jaganmohan Rao
Yanamala Divya
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు
ద్రవిడియన్ యూనివర్సిటీ
Scroll for the next article