News23rd Jan 12:43 PMSunil Byrisetty1 min read

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. కుదిరే పనేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన విధానంపై ఆలోచిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను మంత్రి

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. కుదిరే పనేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన విధానంపై ఆలోచిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను మంత్రి నారా లోకేష్ ప్రస్తావించడంతో, ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా నిషేధ చట్టాన్ని అధ్యయనంగా తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆ దేశంలో పిల్లల రక్షణ కోణంలో తీసుకున్న చర్యలు ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించి, ఆ అనుభవాలను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ఉదాహరణగా నిలిచే విధంగా ఈ నిర్ణయం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో ఫలితాన్ని ఇవ్వాలంటే చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక మార్పు కూడా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra Pradesh Government
Social Media Ban
Children Under 16
Nara Lokesh
Child Safety
Australia Model
డిజిటల్ నియంత్రణ
చట్టపరమైన చర్యలు
సామాజిక మార్పు
ఏపీ పాలసీ చర్చ
Scroll for the next article