Jobs7th Sep 12:46 PMSunil Byrisetty1 min read
సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50వేలమందికి ఉద్యోగాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ & ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP), ఇండో యూరో సింక్రనైజేషన్ & జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... తొలిబ్యాచ్ లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని అన్నారు.