News6th Dec 08:50 AMSunil Byrisetty1 min read
మరోసారి మంత్రి లోకేష్ విదేశీ పర్యటన
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 6నుంచి 10వతేదీ వరకు 5రోజులపాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. 6వ
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 6నుంచి 10వతేదీ వరకు 5రోజులపాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. 6వతేదీన తొలిరోజు డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8,9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10వతేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18నెలల్లో మంత్రి లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరిస్తూ ఇప్పటివరకు మంత్రి లోకేష్ చేసిన పర్యటనలతో ఇటీవల విశాఖలో జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయి.