News13th Aug 11:46 AMSunil Byrisetty1 min read
నేడు మంగళగిరిలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతుల పర్యటన
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు బుధవారం మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని గోలి వారి వీధిలో ఏర్పాటు చేసిన లక్ష్మి శారీస్ వార
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు బుధవారం మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని గోలి వారి వీధిలో ఏర్పాటు చేసిన లక్ష్మి శారీస్ వారి వస్త్ర దుకాణాన్ని మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రారంభించారు. అనంతరం 11:30 గంటలకు కాజ పంచాయతి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరంలోని పాత మంగళగిరి జీ ఆర్ స్కూల్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ హ్యాండ్లూమ్ షో రూమ్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. మంగళగిరిలో మంత్రి లోకేష్ దంపతుల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.