News19th Oct 09:39 AMSunil Byrisetty1 min read

సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికింది. తెలుగుదేశం ఆ

సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికింది. తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో సిడ్నీ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి సిడ్నీ వచ్చిన తెలుగు ఎన్నారైలు మంత్రి లోకేష్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. టీడీపీ సభ్యులందరినీ అప్యాయంగా పలకరించిన లోకేష్ తెలుగు ప్రజలతో ఫోటోలు దిగారు. ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పలు సంస్థలతో భేటీ అయి పెట్టుబడులపై చర్చించనున్నారు.
Andhra Pradesh
Investment Meetings
Nara Lokesh
Australia Visit
Sydney
TDP
Telugu NRIs
సిడ్నీ
విద్యాశాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్
పెట్టుబడులు
తెలుగు ప్రజలు
Scroll for the next article