News9th Oct 02:35 PMSunil Byrisetty1 min read
అమరావతిలో చెస్ అకాడమీ
ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భా
ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి బోర్డు-1లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున మద్దతుగా నిలవాలని కోనేరు హంపి విజ్ఞప్తి చేశారు. ఆమె వినతి పట్ల సానుకూలంగా మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.