News13th Dec 12:47 PMSunil Byrisetty1 min read
మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్
విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స
విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ తోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలకు అమ్మగా, నాన్నగా మారిన వ్యవస్థ అన్నారు. పెద్దలు చెప్పినట్లు కృతజ్ఞతా భావం చాలా అవసరమని, మనం గొప్ప పనులు చేయలేకపోవచ్చు.. కానీ చిన్న చిన్న పనులు ప్రేమతో చేయవచ్చని మదర్ థెరిసా చెప్పారని గుర్తు చేశారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాన్ బాస్కో ప్రేమ నివాసానికి గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.