News28th Oct 06:03 PMSunil Byrisetty1 min read
40 లక్షల మందిపై సైక్లోన్ ఎఫెక్ట్
మొంథా తుఫాన్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ఉన్నప్పటి నుంచే సమీక్షలు ప్రారంభించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. రాష్ట్
మొంథా తుఫాన్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ఉన్నప్పటి నుంచే సమీక్షలు ప్రారంభించారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ప్రధాని మోదీ ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. రాష్ట్రానికేం కావాలన్నా ఇస్తామన్నారని చెప్పారు. సైక్లోన్ వల్ల 40 లక్షల మందిపై ప్రభావం ఉంటుందని, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లో ఉన్నాయని, 1328 గ్రామాల్లో ముందస్తుగా చర్యలు తీసుకున్నామని వివరించారు. 3465 మంది గర్భిణులను తరలించి, వారికి పౌష్టికాహారం అందించి, వైద్యం అందిస్తున్నామన్నారు. 1906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి, అవసరమైన సామగ్రి ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, 14798 పాఠశాలలకు సెలవులిచ్చామని, 364 పాఠశాలలను సైక్లోన్ షెల్టర్లుగా మార్చామని పేర్కొన్నారు. సైక్లోన్ తీరం దాటాక పునరుద్ధరణ కోసం 11347 విద్యుత్ స్తంభాలు, 1210 ట్రాన్స్ ఫార్మర్లు, 772 రిస్టొరేషన్ టీంలను రంగంలో దింపాం, ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన కరెంట్ సరఫరా పునరుద్ధరిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.