News15th Mar 01:06 PMSunil Byrisetty1 min read
పార్క్ లో చెత్తను శుభ్రం చేసిన మంత్రి
పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత
పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్క్ లో చెత్తను శుభ్రంచేసి స్వయంగా చెత్తకుండీలో వేశారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్.నాగార్జునతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఊరు, ఎక్కడ పనిచేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నానని, 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాని అతడు తెలిపాడు. ఎంతమంది పిల్లలు, ఎక్కడ చదువుతున్నారని అడగగా... తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అమ్మాయి పదో తరగతి, అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నారని, ఇద్దరినీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగుందని, మధ్యాహ్న భోజనం కూడా బాగా పెడుతున్నారని చెప్పాడు.
మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను ఇంకా మెరుగుపర్చాల్సి ఉందని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ కూడా మార్చామని ఈ సందర్భంగా చెప్పారు.
పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామాగ్రి ఏవిధంగా ఉందని, చెత్తకుండీలు ఉన్నాయా అని అడగగా.. చేతికి వేసుకునే గ్లోవ్స్ మరింత మందంగా ఉండాలని సూచించాడు.