Politics5th Mar 04:46 PMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్ ను ఏమైనా అంటే ఊరుకోనన్న లోకేష్

ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే నిర్ణయించారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కానీ అది జగన్ కు తెలియడం లేదన్నారు. ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్తారని, మళ్లీ కనిపించరని

పవన్ కళ్యాణ్ ను ఏమైనా అంటే ఊరుకోనన్న లోకేష్
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే నిర్ణయించారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కానీ అది జగన్ కు తెలియడం లేదన్నారు. ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్తారని, మళ్లీ కనిపించరని వ్యాఖ్యానించారు. అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రెస్ మీట్ తర్వాత పత్రికా సమావేశం నిర్వహించిన లోకేష్ కౌంటర్లిచ్చారు. జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను కించపర్చేలా జగన్ మాట్లాడుతున్నారని, కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, జగన్ వాస్తవాలు తెలుసుకోవాలని లోకేష్ హితవు పలికారు.
YS Jagan
Janasena Party
Pawan Kalyan
AP Political News
వైస్ జజనసేన పార్టీ
పవన్ కళ్యాణ్
వార్తలు
Scroll for the next article